పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా తూటాల వర్షం...
4 రోజుల క్రితం

బంగ్లాదేశ్ కేంద్రంగా భారత్‌పై ఉగ్ర దాడులకు కుట్ర పన్నుతున్న లష్కరే తోయిబా ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు సరిహద్దు సమీపంలో అరెస్ట్ చేశారు. >>లష్కరే తోయిబాకు చెందిన షబ్బీర్ అహ్మద్ లోన్ (అలియాస్ రాజా, అలియాస్ కాశ్మీరి)ను ఢిల్లీ బోర్డర్ వద్ద అరెస్ట్ చేశారు. >>ఇతను జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా కంగన్ నివాసిగా అధికారులు గుర్తించారు. >>ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మరియు సెంట్రల్ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నిందితుడు పట్టుబడ్డాడు. >>బంగ్లాదేశ్ నుండి కార్యకలాపాలు సాగిస్తూ, భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్ర దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.